Corona Cases : దేశంలో పెరిగిన కరోనా కేసులు.. వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

నిన్నటితో పోల్చితే ఈ రోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం 6,822 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Corona Cases : నిన్నటితో పోల్చితే ఈ రోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం 6,822 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్నటికంటే ఈ రోజు 23 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 9,525 మంది కోలుకున్నారు. ఇక గడిచిన 24గంటల్లో కరోనాతో 195 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్‌ కేసులున్నాయి.

చదవండి : Coronavirus Cases: దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరింది. ఇందులో 3,40,89,137 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 4,73,952 ప్రాణాలు కోల్పోయారు. ఇక టీకా డ్రైవ్ వేగంగా కొనసాగుతుంది. వైద్యసిబ్బంది.. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి కూలీలకు టీకా ఇస్తున్నారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 129.5 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది

చదవండి : Corona Cases : ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, ఇద్దరు మృతి

ట్రెండింగ్ వార్తలు