Coronavirus Cases: దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఘోరమైన కరోనావైరస్ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 6వేల 822 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Coronavirus Cases: దేశంలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

Corona Cases (2)

Coronavirus Cases: దేశంలో ఘోరమైన కరోనావైరస్ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 6వేల 822 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 220మంది మరణించారు. ఇప్పటివరకు, దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు 23 నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 4 లక్షల 73 వేల 757 మంది మరణించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 95 వేల 14గా ఉంది. అదే సమయంలో, కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య నాలుగు లక్షల 73 వేల 757కు పెరిగింది. గడిచిన 24గంటల్లో 10వేల నాలుగు మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3 కోట్ల 40 లక్షల 79 వేల 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

128కోట్లకు పైగా డోస్‌లు:
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా.. ఇప్పటివరకు 128 కోట్లకు పైగా యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు ప్రజలకు ఇచ్చారు.

దేశంలో ఇప్పటివరకు 23 మందికి ఓమిక్రాన్ సోకింది
సోమవారం, ముంబైలో ఇద్దరు వ్యక్తులలో Omicron వేరియంట్ ఉన్నట్లుగా నిర్ధారించబడింది. ఇద్దరూ నవంబర్ 25న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినవారే. వారి కరోనా నివేదిక పాజిటివ్‌గా వచ్చిన తరువాత, నమూనాను పూణేలోని ఎన్‌ఐవిలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఇప్పుడు అతని రిపోర్ట్ ఒమిక్రాన్ ఉన్నట్లుగా వచ్చింది. దీంతో మహారాష్ట్రలో ఓమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 10కి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం 23 మందిలో ఓమిక్రాన్ వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది.