నేవీ “సీ విజిల్” విన్యాసాలు ప్రారంభం

“సీ విజిల్ 2019” పేరుతో యుద్ధ సన్నద్ధతను అంచనా వేసేందకు నావికా దళం నిర్వహిస్తోన్న విన్యాసాలు మంగళవారం(జనవరి 22,2019) ప్రారంభమయ్యాయి. 26/11 ముంబై దాడి జరిగిన పదేళ్ల తర్వాత తమ తీరప్రాంత శక్తిసామర్ధాలను పరీక్షించుకొనేందుకు, సముద్రమార్గంలో ఏదైనా దాడి జరిగితే ఏ విధంగా స్పందించగలమో పరీక్షించేందుకు  భారతీయ నావికా దళం తీరప్రాంత రక్షణ ఎక్సర్ సైజ్ ను నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు జరుగనున్నాయి.  తీర గస్తీ దళం, ఇతర వ్యవస్థలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.

13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 7వేల 516 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాల్లో సీ విజిల్ విన్యాసాలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయిలో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. చేపల కేంద్రాలు, అన్ని స్థాయిల పోర్టులు, లైట్ హౌస్, కంట్రోల్ రూమ్ లు, లైట్ హౌస్ వంటి ప్రాంతాల్లో భధ్రతను పర్యవేక్షించేందుకు బహుల వ్యవస్థల బృందాలను మోహరించినట్లు రక్షణమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.