Indian Railways Cancels Over 440 Trains
Railway: శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా పలు రూట్లలో 440 రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. కాగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు, కొన్నింటి ఆలస్యంగా నడిపినట్లు, కొన్ని రైళ్లను కుదించినట్లు రైల్వే పేర్కొంది. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రైలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పు ప్రభావం, సాంకేతిక కారణాలు, రైలు ప్రమాదాలు కారణంగా ఇంత పెద్ద మొత్తంలో రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది.
63 రైళ్ల రూట్లను మార్చారు, మరో 58 రైళ్లను కుదించారు, 16 రైళ్లను రీషెడ్యూల్ చేశారు, మరో 51 రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులు రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లిన రైళ్ల వివరాలను రైల్వే వెబ్ సైట్లో చూడాలని రైల్వే శాఖ అధికారులు కోరారు. దర్భంగా, సీల్ధా, హౌరా, న్యూఢిల్లీ, భటిండా, ఆజంగంజ్, సికింద్రాబాద్, పటాన్ కోట్, భోపాల్, లక్నో, ప్రయాగరాజ్, హోషియార్ పూర్, జలంధర్, రాంనగర్, కోయంబత్తూర్, బిలాస్ పూర్, అహ్మదాబాద్ సెక్షన్లలోని 440 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే పేర్కొంది.