దేశంలో కరోనా నుంచి 2.70 లక్షలు మంది కోలుకున్నారు

  • Publish Date - June 25, 2020 / 02:37 AM IST

దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత ఐదు రోజులుగా ప్రతీరోజు కొత్త కేసుల సంఖ్య 14 వేలకు పైగా ఉంది. దీనితో, కరోనా మహమ్మారి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

అయితే కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు, సుమారు 56.71 శాతం, అంటే 2.70 లక్షలకు పైగా రోగులు ఆరోగ్యవంతులుగా మారారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 4,56,183కు చేరుకోగా, మరణించిన వారి సంఖ్య 14,476కు చేరుకుంది.

ఇక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,83,022గా ఉంది. 2,58,684 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 73.5 లక్షలకు పైగా కరోనా పరీక్షలు జరిగాయి.

Read: మంచి మనస్సు : 800 మందికి ఉపాధి కల్పించిన IAS Officer