Ambani Family: అంబానీ కుటుంబానికి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయని తెలిసిందే. విదేశీ బ్రాండ్లను కూడా తెప్పించుకుని ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీకి బయటకు రావాలంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ తప్పనిసరి. కొన్నేళ్ల క్రితం బీఎండబ్ల్యూకు చెందిన పలు మోడళ్లను కొనుగోలు చేసిన ఫ్యామిలీ.. కాన్వాయ్ లోనే కదలాల్సిన పరిస్థితి.
ఎంత ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ వేగంగా కదలడానికి ఉండదు. ఎందుకంటే చుట్టూ ఉన్న పోలీస్ సెక్యూరిటీ కార్ల కెపాసిటీ అలాంటిది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఓ ప్రైవేట్ వ్యక్తి అంబానీని ప్రొటెక్ట్ చేసేందుకు అత్యంత ఖరీదైన సెక్యూరిటీ కార్లను రంగంలోకి దింపారు. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కాన్వాయ్ లకు ఉన్నట్లు సిగ్నల్ జామర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ లాంటివి ఏర్పాటు చేయదలచుకోలేదు. కానీ, అత్యంత ఖరీదైన కార్లను మాత్రం కేటాయించారు.
Land Rover Range Rover Vogue
అంబానీ సెక్యూరిటీలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ అత్యంత ఖరీదైన వాహనం. అటువంటివి మరి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటికీ పోలీస్ స్టిక్కర్లు, స్ట్రోబ్ లైట్స్ పెట్టి పబ్లిక్ రోడ్లపై కనిపించనున్నాయి. సెక్యూరిటీ కార్ల విలువ దాదాపు రూ.2కోట్ల నుంచి రూ.3.5కోట్ల వరకూ పలుకుతుంది.
Land Rover Discovery Sport
అంబానీ కాన్వాయ్ లో ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీ వాడుతున్నారు. వీటికి కూడా స్ట్రోబ్ లైట్స్, పోలీస్ స్టిక్కర్లు అతికించి ఉంచుతారు. అదే కాక మరో ఐదు రకాల కార్లు కూడా కాన్వాయ్ లో భాగమే.
BMW X5
అంబానీ ఫ్యామిలీ సెక్యూరిటీ కార్ వివరాల్లో తొలి ప్రీమియం ఎస్‌యూవీ ఇదే. ఇది రాకముందు ఆ కుటుంబానికి జెడ్ ప్లస్ కవర్ సెక్యూరిటీ ఉండేది కానీ, వేగవంతమైన వాహనాల్లో ప్రయాణించే వారు కాదు. అంబానీ పలు BMW X5 ఎక్స్ డ్రైవర్30 మోడళ్లు కొని సెక్యూరిటీ కోసం కేటాయించారు. ఇందులో 3లీటర్ల ఆరు సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉండటంతో 258 బీహెచ్‌పీ, 560 ఎన్ఎమ్ టార్క్‌తో కదులుతుంటాయి.
Ford Endeavour
అంబానీ ఫ్యామిలీ సెక్యూరిటీ కార్లలో Ford Endeavour ఒకటి. వైట్ కలర్ లో మెరిసి Endeavour.. అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్ లో కలిసిపోయింది. 3.2లీటర్ డీజిల్ ఇంజిన్ తో 197బీహెచ్ పీ, 470 ఎన్ఎమ్ టార్క్ తో కదులుతుంది.
Mahindra Scorpio
అంబానీ సెక్యూరిటీ అఫీషియల్ పోలీస్ వెహికల్స్ లో Mahindra Scorpioలు చాలానే ఉన్నాయి. సీఆర్పీఎఫ్ సిబ్బంది జెడ్ ప్లస్ సెక్యూరిటీతో నడిపే కార్లు ఎక్కువే.
Toyota Fortuner
ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యుల్లో కనీసం 6Toyota Fortuner కార్లు చూడొచ్చు. అన్ని న్యూ జనరేషన్ వే.. వైట్ కలర్ లో ఉండేవే.
Honda CR-V
ఇండియన్ మార్కెట్ లో పాపులర్ మోడల్.. Honda CR-V. సంవత్సరాలుగా ఏ మాత్రం చార్మింగ్ తగ్గకుండా దూసుకెళ్తుంది. అంబానీ ఫ్యామిలీలో ఇవి కూడా ఉన్నాయి. నీతా అంబానీ కాన్వాయ్ లో పైలట్ కార్ Honda CR-Vనే.