కోవిడ్ భయంతో ఎయిర్ హోస్టెస్ ను తిట్టి, కొట్టిన కాలనీ వాసులు

  • Publish Date - September 8, 2020 / 05:39 PM IST

ఇండిగో ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ ద్వారా తమకు కరోనా సోకుతుందనే భయంతో ఒక ఎయిర్ హోస్టెస్ ను…. ఆమె నివసించే కోలనీ వాసులు బహిష్కరణకు గురిచేశారు. కోల్ కతా సమీపంలోని హౌరా, షిబాపూర్ లో ఈ దారుణం జరిగింది.

గత రెండేళ్లుగా ఇండిగో ఎయిర్ లైన్స్ లో సుదీపా అధికారి (23) ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా గత  5 నెలలుగా విమానాల రాక పోకలపై నిషేధం విధించటంతో ఆమె కూడా ఇంటివద్ద తల్లితండ్రులతో  ఉంటోంది. ఇటీవల దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభించటంతో ఆమె తిరిగి తన విధుల్లోకి వెళుతోంది. ఇది ఆ కోలనీవాసులకు నచ్చలేదు.

విమాన సర్వీసుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని వారు భయపడ్డారు. ఆమె రోజూ విమానాల్లో ప్రయాణించి రావటం వలన కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో, సుదీపా తల్లితండ్రులను కూడా బయట తిరగనివ్వలేదు. వారిని షాపుకు వెళ్లి నిత్యావసర వస్తులు కూడా తెచ్చుకోనివ్వలేదు. పైగా బయట తిరగ వద్దని హెచ్చరించారు.
కొన్నిరోజుల క్రితం సుదీపా వీధి కుక్కలకు ఆహారం వేస్తుంటే కూడా వద్దని వారించారు. ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇండిగో విమానయాన సంస్ధ అన్ని దశల్లోనూ కోవిడ్ రక్షణ  చర్యలు తీసుకుంటోందని… అయినా కానీ తమ కోలనీ వాసులు నన్నుబహిష్కరించటం బాధిస్తోందని ఆమె వాపోయింది.
https://10tv.in/news-reader-devi-nagavalli-entered-into-biggboss-show/

ఈవిషయమై ఆమె హౌరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కరోనా వారియర్స్ గా సమాజంలో ముందుండి పని చేస్తున్నకొద్దిమంది ప్రొఫెషనల్స్ పై ఇలాంటి ఘటనలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

లాక్ డౌన్ ప్రారంభ సమయంలోనే ఇండిగో విమానయాన సిబ్బంది ఎదుర్కోన్న ఇలాంటి కేసుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ పై యుధ్ధం చేయమని చెపుతున్నా…… ప్రజలు మాత్రం మనుషుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు.