IOA forms 7-member committee to probe sexual allegations against Brij Bhushan Sharan Singh
Brij Bhushan: తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు (డబ్ల్యూఎఫ్‌ఐ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారత రెజ్లింగ్ సంఘం (ఐఓఏ) విచారణకు ఆదేశించింది. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని శుక్రవారం ఐఓఏ ఏర్పాటు చేసింది. మేరీ కోమ్, డోలా బెనర్జీ, అలకనంద అశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్ ఐఓఏ కమిటీలో ఉన్న ఏడుగురు సభ్యులు. ఈ కమిటీ ఏర్పడిన అనంతరమే సభ్యులు సమావేశమయ్యారు. విచారణలో భాగంగా సంబంధిత పార్టీలందరినీ పిలిపించాలని ఈ కమిటీకి ఐఓఏ వర్గాలు సూచించాయి.
Modi Gold Bust: ప్రధాని మోదీ బంగారు ప్రతిమను రూపొందించిన గుజరాత్ నగల వ్యాపారి
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను నిరసిస్తూ రెజ్లర్లు శుక్రవారం భారత ఒలింపిక్ సంఘానికి లేఖ రాస్తూ పలు ఆరోపణలు చేశారు. ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరమే తాజా కమిటీ ఏర్పాటైంది. డబ్ల్యూఎఫ్‌ఐ ఆర్థిక దుర్వినియోగానికి (నిధుల) పాల్పడుతోందని రెజ్లర్లు ఆరోపించారు. జాతీయ శిబిరంలోని కోచ్‌లు, స్పోర్ట్స్ సైన్స్ సిబ్బంది పూర్తిగా అసమర్థులని ఐఓఏ అధ్యక్షులు పీటీ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇక దీనికి ముందు రాజీనామా డిమాండ్లపై బ్రిజ్ భూషణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తాను ఇక్కడి వరకు (ప్రస్తుతం ఉన్న పదవి) రాలేదని అన్నారు. తనను ప్రజలు ఎన్నుకున్నారని, ఆ ఎన్నిక ఆధారంగా ఈ స్థాయికి వచ్చినట్లు శుక్రవారం పేర్కొన్నారు. తన మీద పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని, దానిని తొందరలోనే బయట పెడతానని బ్రిజ్ భూషణ్ ప్రకటించారు.
BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యూమెంటరీ.. పోలీస్ కేసు ఫైల్ చేసిన సుప్రీం లాయర్
బ్రిజ్ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాల్సిందేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా దాదాపు 30 మంది రెజ్లర్లు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగారు. శుక్రవారం వరుసగా మూడో రోజు తమ నిరసనను కొనసాగించారు. పలువురు వీరికి సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటిస్తున్నారు. రెజ్లర్ల ఆరోపణలను కేంద్ర క్రీడాశాఖ సీరియస్ గా తీసుకోవటంతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గురువారమే రాజీనామా చేస్తారని భావించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Bharat Jodo Yatra: రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదట, రెయిన్ కోటట
మహిళా రెజర్లపై వేధింపులకు పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడనని, నేను ఎన్నుకోబడిన వ్యక్తిని, ఎవరి దయతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిలో లేనని శరణ్ సింగ్ స్పష్టం చేశారు. తాను దేశం విడిచిపోవచ్చని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అమిత్ షాను కలిశారా అని మీడియా ప్రశ్నించగా.. కేంద్ర హోమంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ లో ఎవరిని నేను కలవలేదని, ఎవరితోనూ మాట్లాడలేదని అన్నారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ తెలిపారు. అయితే, సాయంత్రం 4 లేదా 5గంటల సమయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేసి అన్ని విషయాలను వెల్లడిస్తానని అన్నారు.