Bharat Jodo Yatra: రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదట, రెయిన్ కోటట

భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కశ్మీర్‌లోని కతువాలో శుక్రవారం ప్రారంభమైంది. తీవ్రమైన చలిగాలులు, మంచు కురుస్తుండటం, చిరుజల్లుల కారణంగా యాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర ఒక గంట పదిహేను నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. రాహుల్ ఒంటిపై బ్లాక్ జాకెట్ కొద్దిసేపు వేసుకుని కనిపించారు. కొద్దిసేపటికి దానిని ఒంటిపై నుంచి తీసేసి ఎప్పటిలాగే తెలుపురంగు టీ-షర్ట్‌తోనే యాత్ర కొనసాగించారు.

Bharat Jodo Yatra: రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదట, రెయిన్ కోటట

What Rahul is wearing is not a jacket, but a raincoat

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరుకుంది. జనవరి 30న శ్రీనగర్‌లో భారీ ర్యాలీతో ఆయన యాత్రను ముగించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో శుక్రవారం భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. చిరుజల్లుల్లోనూ రాహుల్ గాంధీ తన పాదయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో వర్షంకు రక్షణగా రాహుల్ నల్ల రెయిన్ జాకెట్ ధరించి కనిపించారు. యాత్ర ప్రారంభం నుంచి తెల్ల టీ-షర్ట్‌తోనే కనిపిస్తున్న రాహుల్.. తొలిసారి నల్ల జాకెట్ ధరించారు. దీనిపై పలువురు బీజేపీ నేతలు రాహుల్‭కు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Brij Bhushan: ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇక్కడ లేను.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

అయితే బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాహుల్ వేసుకున్నది అసలు జాకెటే కాదని, రెయిన్ కోటని స్పష్టతనిచ్చింది. కతువాలో రాహుల్ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మధ్యాహ్నం ఓ ట్వీట్‌లో స్పష్టత ఇచ్చింది. ”యాత్రలో రాహుల్ వేసుకున్నది జాకెట్ కాదు, రెయిన్ కోట్. వర్షం రావడం వల్ల ఆ రెయిన్ కోట్ వేసుకున్నారు. వర్షం ఆగిపోయింది, దానితో పాటే రెయిన్‌ కోట్ కూడా మాయమైంది” అని ట్వీట్ చేసింది. వర్షం కూడా యాత్రను అడ్డుకోలేకపోయిందంటూ ఒక వీడియోను కూడా ట్వీట్‌కు జోడించింది.

Swati Maliwal: స్వాతి మాలివాల్‌ను కారుతో లాక్కెళ్లిన వీడియో విడుదల.. స్వాతిపై బీజేపీ విమర్శలు