Swati Maliwal: స్వాతి మాలివాల్‌ను కారుతో లాక్కెళ్లిన వీడియో విడుదల.. స్వాతిపై బీజేపీ విమర్శలు

గురువారం ఉదయం మూడు గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ రెండో గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఫుట్‌పాత్‌పై ఎదురు చూస్తున్న స్వాతి వద్దకు వచ్చిన కార్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో స్వాతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు, డ్రైవింగ్ సీట్లో ఉన్న అతడి దగ్గరకు వెళ్లి ప్రశ్నించింది.

Swati Maliwal: స్వాతి మాలివాల్‌ను కారుతో లాక్కెళ్లిన వీడియో విడుదల.. స్వాతిపై బీజేపీ విమర్శలు

Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్‌ను ఒక డ్రైవర్ కొంత దూరం కారుతో లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం మూడు గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ రెండో గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఫుట్‌పాత్‌పై ఎదురు చూస్తున్న స్వాతి వద్దకు వచ్చిన కార్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు.

Milk Adulteration: దేశంలో పాల కల్తీపై ఆ ప్రచారంలో నిజం లేదు.. కేంద్రం ప్రకటన

దీంతో స్వాతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు, డ్రైవింగ్ సీట్లో ఉన్న అతడి దగ్గరకు వెళ్లి ప్రశ్నించింది. దీంతో అతడు కారును అలాగే నడుపుకొంటూ వెళ్లిపోయాడు. ఆ సమయంలో కారు విండోలో స్వాతి చేయి ఇరుక్కుపోయింది. దీంతో స్వాతి కూడా కొద్ది దూరం అలాగే కారుతోపాటు వెళ్లిపోయింది. తర్వాత అతడు విండో గ్లాస్ దించడంతో స్వాతి బయటపడింది. ఈ ఘటనపై స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన పోలీసులు కార్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలో కార్, స్వాతి వద్దకు రావడం.. డ్రైవర్‌తో ఆమె మాట్లాడటం.. కారులో ఆమెను లాక్కుంటూ వెళ్లిపోవడం వంటివన్నీ రికార్డయ్యాయి.

Kerala: కాలేజీలో హీరోయిన్‌తో విద్యార్థి అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన యాజమాన్యం

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై, వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఈ వీడియో తీసినట్లుగా ఉందని విమర్శించింది. ఘటన జరిగిన వెంటనే స్వాతి ఎందుకు స్పందించలేదని బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖరానా ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ ఘటన అంతా సృష్టించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు.