Iran vs Israel War : ఇరాన్ – ఇజ్రాయెల్ వార్ వేళ భారత్‌కు భారీ ఊరట.. ఇండియాకు గుడ్‌న్యూస్ చెప్పిన ఇరాన్

Iran vs Israel War : ఇరాన్, ఇజ్రాయెల్ వార్ కొనసాగుతున్న వేళ భారతదేశానికి భారీ ఊరట లభించింది. ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్ చెప్పింది.

Iran vs Israel War

  • కొనసాగుతున్న ఇరాన్ – ఇజ్రాయెల్ వార్
  • ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్‌కు భారీ ఊరట
  • యుద్ధం వేళ హర్మూజ్ జలసంధిని మూసివేత
  • భారత్ జెండా నౌకలకు అనుమతి ఇచ్చిన ఇరాన్

Iran vs Israel War : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇరాన్‌సైతం ఇజ్రాయెల్‌తో‌పాటు గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత మోగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. చముర రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఆయిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్ దేశంతోపాటు ఎన్నో దేశాలలో చమురు, వంటగ్యాస్ కొరత ఏర్పడింది. అయితే, తాజాగా.. భారతదేశానికి భారీ ఊరట లభించింది. ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్ చెప్పింది.

Also Read : Gold Price Today : ఆహా.. మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య చర్చలు జరిగాయి. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి జైశంకర్ – అరాగ్చీల మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. మంగళవారం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ వాటిల్లో ఒకటి. ఈ చర్చలు ఫలితంగా భారత దేశానికి ఉపశమనం లభించింది. భారత్ జెండాతో ఉన్న నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెల్లడించాయి. ఈ చర్చల ఫలితంగా పుష్పక్, పరిమళ్ పేరిట ఉన్న రెండు ఇండియన్ ట్యాంకర్లు హర్మూజ్ జలసంధిని దాటినట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే ఒక నౌక ముంబయికి చేరుకోగా.. మరో రెండు రోజుల్లో మరో నౌక భారతదేశానికి రానుంది.

వాస్తవానికి హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకం. గల్ఫ్ దేశాల నుంచి రవాణా అయ్యే చమురు ఈ మార్గం గుండానే వెళ్తుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20శాతం ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా మిసైళ్ల వర్షం కురిపిస్తుండటంతో ఇరాన్ హార్మూజ్ జలసంధి మార్గాన్ని బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తమ హెచ్చరికలను కాదని ఓడలు ముందుకు సాగితే పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అంతేకాదు.. ఒక నౌకను కూడా పేల్చేసింది.

మరోవైపు.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ ఫారిన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ తో చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధం వల్ల సంక్షోభ పరిస్థితులపై చర్చించారు.