IRCTC: ఇకపై ఇంటి నుంచి రైలు టికెట్లు బుక్ చేసుకోలేరా.. IRCTC సంచలన నిర్ణయం.. ఒకేసారి 9 కోట్ల అకౌంట్లు బ్లాక్

రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చిన ఐఆర్సీటీసీ (IRCTC().

IRCTC blocked 3 crore user accounts.

  • 9 కోట్ల ఖాతాలపై రైల్వే నిఘా
  • 3 కోట్ల అకౌంట్లు శాశ్వతంగా బ్లాక్
  • కేవైసీ చేస్తేనే ఖాతాలు యాక్టివేట్

IRCTC: ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ (IRCTC) షాకిచ్చింది. దళారుల సమస్యలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను రంగంలోకి దంపింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న దాదాపు 9 కోట్ల (90 మిలియన్ల) యూజర్ అకౌంట్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించింది.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో తరహాలో సిటీ బస్సు ట్రావెల్.. ట్రాఫిక్ కు చెక్..

3 కోట్ల అకౌంట్లు పర్మినెంట్ బ్లాక్:

ఐఐ అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐఆర్‌సీటీసీ అధికారులు లోతైన సమీక్ష నిర్వహించారు. ఇందులో అత్యంత అనుమానాస్పదంగా తేలిన 3 కోట్ల (30 మిలియన్ల) అకౌంట్లను శాశ్వతంగా బ్లాక్ చేశారు. ఈ ఖాతాలు భవిష్యత్తులో మళ్లీ యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా లేదు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడంలో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ జైన్ వెల్లడించారు.

6 కోట్ల అకౌంట్లు నిష్క్రియం: పునరుద్ధరణ ఎలా?

మరో 6 కోట్ల (60 మిలియన్ల) అకౌంట్లను తాత్కాలికంగా నిష్క్రియం చేశారు. వీటి ద్వారా ప్రస్తుతానికి వందే భారత్, రాజధానితో సహా ఏ రైలుకూ టిక్కెట్లు బుక్ చేయడం సాధ్యం కాదు. అయితే, ఈ 6 కోట్ల మందిలో నిజమైన ప్రయాణికులు కూడా ఉండే అవకాశం ఉంది.

అయితే, తాత్కాలికంగా నిలిచిపోయిన ఖాతాదారులు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా తమ అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. కేవైసీ పూర్తయిన వెంటనే యధావిధిగా టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.