TGSRTC : హైదరాబాద్ వాసులకు బిగ్‌న్యూస్.. మెట్రో తరహాలో సిటీ బస్సు ప్రయాణం.. బీఆర్టీఎస్ సిస్టమ్‌తో ట్రాఫిక్‌కు చెక్..!
TGSRTC BRTS system : నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా, తక్కువ వ్యయంతో మెట్రో తరహా వేగవంతమైన రవాణా అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ప్రజా రవాణా విధానమే బీఆర్టీఎస్.
BRTS system
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లకు చెక్
- బీఆర్టీఎస్ విధానం అమలుకై ప్రభుత్వం చర్యలు
- మెట్రో తరహాలో సిటీ బస్సు ప్రయాణం
TGSRTC BRTS system : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వతంగా చెక్ పెట్టడంతోపాటు ప్రజారవాణా వ్యవస్థను విప్లవాత్మకంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు నగరంలో సిటీ బస్సుల ప్రయాణాన్ని మెట్రో రైలు తరహాలో వేగవంతం, సులభతరం చేసేందుకు బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) అమలుపై అధికారులు ముమ్మర కసరత్తు ప్రారంభించారు.
Also Read : Kavitha : పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేసిన కవిత.. కళాకారులను అవమానిస్తావా?
బీఆర్టీఎస్ విధానం అంటే..
నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా, తక్కువ వ్యయంతో మెట్రో తరహా వేగవంతమైన రవాణా అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ప్రజా రవాణా విధానమే బీఆర్టీఎస్. 1974లో బ్రిజిల్‌లోని కురిటిబా నగరంలో తొలిసారిగా ఈ విధానాన్ని ప్రారంభించారు. చైనాలోని పలు ప్రధాన నగరాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉంది. అయితే, ఆసియాలోనే తొలి బీఆర్టీఎస్ నెట్వర్క్ ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం 170కిపైగా నగరాల్లో అమల్లో ఉంది. బీఆర్టీఎస్ విధానానికి ఎంపిక చేసిన మార్గాల్లో ఇతర వాహనాలను అనుమతించరు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయడంతో బస్సుల్లో సమయం వృథా కాదు. స్టేషన్ ప్లాట్ ఫారమ్, బస్సు ఫ్లోర్ ఒకే ఎత్తులో ఉండటంతో వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ప్రయాణించొచ్చు. కూడళ్ల వద్ద బస్సులకు ప్రాధాన్యత ఇచ్చే సిగ్నల్ వ్యవస్థను కూడా వినియోగిస్తారు.
భారతదేశంలో కూడా..
మెట్రోతో పోలిస్తే నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. దీనికితోడు ప్రయాణ సమయం తగ్గడంతోపాటు కాలుష్యం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, బీఆర్టీఎస్ విధానం పూణేలో 2026లో రెయిన్బో పేరుతో ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో జన్మార్గ్ పేరుతో ఈ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో బీఆర్టీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలో అమలుకు అనువైన మార్గాలు, ఎదురయ్యే సవాళ్లు, పరిష్కార మార్గాలపై అధ్యయనం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ఇంజనీర్లు నగరంలోని ప్రధాన రహదారులపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
