Kavitha : పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేసిన కవిత.. కళాకారులను అవమానిస్తావా?
Kavitha : పవన్ కళ్యాణ్ 10 ఎకరాలు శిఖం భూమిని కొనుక్కున్నారు. కొడికుంట సర్వే నెంబర్ 706లో శిఖం భూమి ఉంది. పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ సమయంలో అనేక తప్పులు జరిగాయి. పవన్ కల్యాణ్ భూమిని వాపస్ ఇవ్వాలి. శిఖం భూమిలో వేసిన కంచెను తొలగించాలని కవిత అన్నారు.
TRS President Kavitha
- పవన్ కల్యాణ్ పై కవిత సంచలన కామెంట్స్
- ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోం
- ఏపీలో రాజధాని కట్టుకోండి
- కళాకారులను పవన్ అవమానిస్తారా
Kavitha : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బరాబర్ ప్రజల జాగీర్. తెలంగాణ పవన్ కల్యాణ్ జాగీర్ కాదు. ఆంధ్రా విష కోరల నుంచి తెలంగాణను కాపాడుకున్నాం. ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకోం అంటూ కవిత హెచ్చరించారు. ఏపీలో రాజధాని కట్టుకోండి. పవన్‌కు మద్దతు ఇస్తే నాలుగు ఓట్లు వస్తాయని బీజేపీ భావిస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడున్న ఎనిమిది సీట్లు పోతాయని కవిత అన్నారు.
పవన్ కళ్యాణ్ 10 ఎకరాలు శిఖం భూమిని కొనుక్కున్నారు. కొడికుంట సర్వే నెంబర్ 706లో శిఖం భూమి ఉంది. పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ సమయంలో అనేక తప్పులు జరిగాయి. పవన్ కల్యాణ్ భూమిని వాపస్ ఇవ్వాలి. శిఖం భూమిలో వేసిన కంచెను తొలగించాలని కవిత అన్నారు. గద్దర్‌కు కారు కొనిచ్చా అని పవన్ కల్యాణ్ అంటారా? కళాకారులను పవన్ అవమానిస్తున్నారని కవిత అన్నారు. మీ సినిమాలకు తెలంగాణ నుంచి అత్యధిక రెవెన్యూ వస్తుంది. ఆ డబ్బులతోనే హైదరాబాద్ లో భూములు కొన్నారు. మీకు వచ్చిన డబ్బులతో చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? అంటూ కవిత ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డిపైనా కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని కవిత ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలో ఉన్నారు. ప్రభుత్వ భూములను సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుతాం. హైద్రా వెళ్లి పేదల కాలనీల్లో దాడులు చేసి పెద్దలకు అప్పగిస్తుందని కవిత ఆరోపించారు.
హైడ్రా మాపైన దాడి చేస్తే తిప్పికొట్టాము.. శ్రీఆధిత్య కంపెనీ రివర్ బెడ్ పైన ప్రాజెక్టు కడుతోంది. శ్రీ ఆధిత్య వెనుక ఒక ఎంపీ ఉన్నారు. శ్రీ ఆధిత్య కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్ ఇచ్చారు. శ్రీ ఆధిత్యను ముట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అంటూ కవిత ప్రశ్నించారు. నాగారం మున్సిపాలిటీలో ఐకామ్ అనే సంస్థ మెగా వాళ్లకు సంబంధించినది. ఐకామ్ సంస్థ బాంబులు తయారు చేస్తుంది. సర్వే నెంబర్ 59లో రోడ్డు, పార్కు, చెరువులు కబ్జా పెట్టారని కవిత అన్నారు.
అప్పుడు కేటీఆర్ పాలన నడిచింది. ఇప్పుడు కేటీఆర్ పాలన నడుస్తోంది. అప్పుడు కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీశ్ రావు, రామారావు. ఇప్పుడు కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. నాడు బీఆర్ఎస్ హయాంలో ఫీనిక్స్ అనే సంస్థకు భూములు కట్టబెడితే సీఎం రేవంత్ రెడ్డి నాడు మాట్లాడారు. నేడు సీఎం హోదాలో ఫీనిక్స్ కు ద్వారాలు తెరిచారని కవిత విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదు. మహారాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వరా. ఏపీ సీఎంతో మాట్లాడి 200 టీఎంసీల నీళ్లు తెచ్చి ఆ తర్వాత బనకచర్ల గురించి మాట్లాడాలని కవిత అన్నారు. తెలంగాణ వాదుల పక్షాన మాట్లాడే వాళ్ళను ప్రభుత్వం ఉద్యమ కారుల అఖిలపక్షం మీటింగ్ కు పిలవలేదు. మాది రిజిస్టర్డ్ పార్టీ మమ్మల్ని ఎందుకు పిలవలేదో అర్ధం కాలేదని కవిత అన్నారు.
