Amartya Sen Death News: నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ మరణించారా? వాస్తవం ఏంటంటే?

ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన క్లాడియా గోల్డిన్ ఖాతా నుంచి (వెరిఫై కాలేదు) మంగళవారం (అక్టోబర్ 10) సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అదే పోస్ట్‌ను ఉటంకిస్తూ, వార్తా సంస్థ పీటీఐ కూడా మరణం గురించిన సమాచారం షేర్ చేసింది

Amartya Sen Death News False: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మృతి చెందారంటూ జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవం. స్వయంగా ఆయన కుమార్తె నందనా దేబ్ సేన్ మీడియాతో మాట్లాడుతూ మరణ వార్తలను ఖండించారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.

వాస్తవానికి, ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన క్లాడియా గోల్డిన్ ఖాతా నుంచి (వెరిఫై కాలేదు) మంగళవారం (అక్టోబర్ 10) సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అదే పోస్ట్‌ను ఉటంకిస్తూ, వార్తా సంస్థ పీటీఐ కూడా మరణం గురించిన సమాచారం షేర్ చేసింది. అయితే అమర్త్యసేన్ కుమార్తెతో మాట్లాడిన తర్వాత పీటీఐ సంస్థ ఆ పోస్ట్‌ను తొలగించింది.

అమర్త్యసేన్ గొప్ప ఆర్థికవేత్తగా, తత్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన 1933లో కోల్‌కతాలో జన్మించారు. ఆయన శాంతినికేతన్, ప్రెసిడెన్సీ కాలేజీ, ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జ్‌లో చదివారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా కూడా పని చేశారు. అలాగే జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా బోధించారు.