అమెరికా కేంద్రంగా ఇస్రో సంచలన ప్రయోగం

భారత్ మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. కార్టోగ్రఫీ శాటిలైట్ కార్టోశాట్-3తో పాటు 13నానో శాటిలైట్లను ప్రయోగించనుంది. అమెరికా కేంద్రంగా నవంబరు 25న సూర్యుని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తోంది. ఈ మేర పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-XLను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా వెల్లడించింది.
నవంబరు 25వ తేదీ ఉదయం 9గంటల 28నిమిషాలకు ప్రయోగించాలని నిర్ణయించారు. కార్టోశాట్-3 శాటిలైట్ హై రీసొల్యూషన్ తో ఫొటోలు తీయగల మూడో జనరేషన్ ఎజైల్. ఈ శాటిలైట్‌ను 509కిలోమీటర్ల కక్ష్యలోకి 97.5డిగ్రీల కోణంతో ప్రవేశపెట్టనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో అమెరికా నుంచి 13నానో శాటిలైట్ల ప్రయోగం చేయనున్నట్లు ఇస్రో తెలిపింది.