Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఇటాలియన్ దినపత్రిక సంచలన విషయం వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించింది కాదని, ఇది ఒక ఉద్దేశపూర్వక చర్య అని దర్యాఫ్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఇటలీకి చెందిన ప్రముఖ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా వెల్లడించింది. గత ఏడాది జూన్ 25న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోవడంతో భారీ పేలుడు సంభవించింది.
ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు హాస్టల్ లో ఉన్న విద్యార్థులు మొత్తం 260 మంది మరణించారు. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. భారత విమానయాన నియంత్రణ సంస్థ అధికారిక నివేదిక వెలువడితేనే ఈ ఘోర ప్రమాదానికి గల పూర్తి కారణాలు వెల్లడి కానున్నాయి.