Supreme Court: తాజ్‭మహల్‭పై విచారణ జరపాలంటూ వేసిన పిటిషన్‭ను పబ్లిసిటీ స్టంటని కొట్టేసిన సుప్రీం

తాజ్‌మహల్‌ అంశానికి సంబంధించి ఆయోధ్యకు చెందిన భాజపా నేత, మీడియా ఇంఛార్జ్‌ రజ్‌నీశ్‌ సింగ్‌ అలహాబాద్‌ హైకోర్టులో గతంలో ఓ పిల్‌ దాఖలు చేశారు. పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. న్యాయపరమైన, రాజ్యాంగ హక్కులకు ఏవిధంగా భంగం కలిగిందో చెప్పడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని పేర్కొంది. పిటిషనర్‌ తరఫున న్యాయవాదిని మందలించిన హైకోర్టు.. ఆ వ్యాజ్యాన్ని మే 12న కొట్టివేసింది. దానిని సవాలు చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినప్పటికీ ఇక్కడా చుక్కెదురయ్యింది.

Supreme Court: తాజ్‌మహల్‌ చరిత్రపై దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై భారత అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ఆ ప్రాచీన కట్టడం ప్రాంగణంలోని 22 గదులను తెరవాలని చేసిన విజ్ఞప్తిలో ప్రజాప్రయోజనం లేదని.. అది ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమేనని అభిప్రాయపడింది. దీనిని తోసిపుచ్చుతూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

తాజ్‌మహల్‌ చరిత్రతో పాటు ఆ ప్రాంగణంలోని 22 గదులు తెరవడంపై విచారణ జరపాలని దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం పరిశీలించింది. ‘ఈ పిటిషన్‌ను కొట్టివేయడంలో హైకోర్టు తప్పేమీ లేదు. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం మాత్రమే. దీనిని తోసిపుచ్చుతున్నాం’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

తాజ్‌మహల్‌ అంశానికి సంబంధించి ఆయోధ్యకు చెందిన భాజపా నేత, మీడియా ఇంఛార్జ్‌ రజ్‌నీశ్‌ సింగ్‌ అలహాబాద్‌ హైకోర్టులో గతంలో ఓ పిల్‌ దాఖలు చేశారు. పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. న్యాయపరమైన, రాజ్యాంగ హక్కులకు ఏవిధంగా భంగం కలిగిందో చెప్పడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని పేర్కొంది. పిటిషనర్‌ తరఫున న్యాయవాదిని మందలించిన హైకోర్టు.. ఆ వ్యాజ్యాన్ని మే 12న కొట్టివేసింది. దానిని సవాలు చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినప్పటికీ ఇక్కడా చుక్కెదురయ్యింది.

T20 World Cup: సూపర్-12కి అర్హత సాధించిన నాలుగు జట్లు ఇవే.. ఏ జట్టు ఏ గ్రూపు నుంచి ఆడుతుందంటే?

ట్రెండింగ్ వార్తలు