జనవరి 15నుంచి జల్లికట్టు : ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాల్సిందే

  • Publish Date - January 11, 2020 / 04:37 AM IST

జనవరి 15 నుంచి జల్లికట్టు షురూ : సంక్రాంతి పండుగకు జల్లికట్టు రెడీ అయిపోయింది. బసవన్నలతో స్థానికులు సిద్ధమైపోయారు. సంక్రాంతి పండుగకు వచ్చిదంటే చాలు జల్లికట్టు  కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు తమిళనాడు ప్రజలు. ఈ క్రమంలో మధురైలో జనవరి 15 నుంచి 31 వరకూ ఈ జల్లికట్టు సంబరాలు జరుగుతాయని ప్రభత్వం శుక్రవారం (జనవరి 10)న ప్రకటించింది. 

పలమెడు, అలంగనల్లూరులో జల్లికట్టులో పాల్గొనటానికి 21 ఏళ్లలోపు వారిని అనుమతించేది లేదని మధురై జిల్లా కలెక్టర్ తెలిపారు. 21 సంవత్సరాలు పైబడినవారు జల్లికట్టులో పాల్గొనానుకునే ఆసక్తిగలవారు తప్పనిసరిగా వారి పేర్లను నమోదు చేయించుకోవాలని స్పష్టంచేశారు. అంతేకాదు ప్రభుత్వం నియమించిన ఆరోగ్య కేంద్రాల్లో వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షల అనంతరం వారు పూర్తి ఫిట్ నెట్ గా ఉన్నారని తేలితేనే జల్లికట్టులో పాల్గొనటానికి అనుమతి ఇస్తామని స్పష్టంచేశారు. 

కాగా..జల్లికట్టు సంక్రాంతి పండుగ తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ  జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను ఆయా యజమానులు ముందుగానే సిద్ధం చేస్తారు. ఎద్దులు ఆరోగ్యంగా ఉండటానికి చక్కటి ఆహారం పెడతారు. వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఎద్దులకు ఆరోగ్య పరీక్షలు కూడా చేయిస్తారు. అంతేకాదు జల్లికట్టులో పాల్గొనే ఎద్దును ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆహారం..ఆరోగ్యం..ఫిట్ నెస్ విషయాలలో ప్రత్యేక శ్రద్ధవహిస్తారు. కాగా..ఈ సంవత్సరం జల్లికట్టులో 2వేలకు పైగా ఎద్దులు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.