COVID-19 Wave: కొవిడ్ మరో వేవ్‌తో వణికిపోతున్న జపాన్

జపాన్ దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. బుధవారం టోక్యోలో నమోదైన 16వేల 878 కొత్త కేసులు ఫిబ్రవరి నుంచి అత్యధికంగా నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

Covid

 

COVID-19 wave: జపాన్ దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. బుధవారం టోక్యోలో నమోదైన 16వేల 878 కొత్త కేసులు ఫిబ్రవరి నుంచి అత్యధికంగా నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనిపించని స్థాయికి COVID-19 ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల.. దేశవ్యాప్తంగా 90వేల కంటే ఎక్కువ పెరిగింది. జపాన్ రాజధానిలో గురువారం 16వేల 662 కొత్త కేసులు నమోదయ్యాయి.

మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురై, ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధికార సంకీర్ణం గెలిచిన తర్వాత తన మొదటి మీడియా సమావేశంలో ప్రధాని ఫుమియో కిషిడా అత్యున్నత స్థాయి జాగ్రత్త అవసరమని సూచించారు.

“కరోనావైరస్ దేశం అంతటా అన్ని వయసుల వారికి వ్యాపిస్తోంది. వేసవి సెలవులు వస్తున్నందున, అన్ని జనరేషన్ల మధ్య పరస్పర కాంటాక్ట్ పెరుగుతుంది” అని తెలిపారు. బూస్టర్ షాట్‌లను తీసుకోవాలని ప్రజలను కోరారు.

Read Also : జపాన్‌వాసుల ఆయుర్దాయం వెనక ‘ఇకిగయ్’ సీక్రెట్..

మరికొద్ది వారాల్లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. BA.5 వేరియంట్ కొత్త కేసులలో సగానికి పైగా ఉన్నాయి.