JDS leader hacked to death ahead of his BJP joining
Mallikarjun Muthyal: భారతీయ జనతా పార్టీలో చేరడానికి అన్నీ సిద్ధం చేసుకుని, ఇక తీర్థం పుచ్చుకోవడమే ఆలస్యమన్న తరుణంలో జనతా దళ్ సెక్యూలర్ పార్టీకి చెందిన మాజీ నేత మల్లికార్జున ముత్యాల్(64) దారుణ హత్యకు గురయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో మంగళవారం ఓ కార్యక్రమం జరగింది. ఆ కార్యక్రమానికి ముత్యాల్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మెడపై గట్టిగా తాడుతో చుట్టిన గుర్తులు కనిపించాయని, రహస్య బాగా బాగా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.
ఆయన తన ఎలక్ట్రానిక షాపులో హత్యకు గురయ్యారు. హత్య అనంతరం షాపులో డబ్బు ఎత్తుకెళ్లారు. దీంతో ఈ హత్య దొంగల ముఠా చేసుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కలబుర్గికి చెందిన ఆయన.. స్థానిక సేడం కోలి కబ్బలిగ కమ్యూనిటీకి కల్బుర్గి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఉత్తర కర్ణాటకలో వొక్కలిగ, లింగాయత్, కురుబ తర్వాత కబ్బలిగ కమ్యూనిటీ నాలుగవ అత్యంత శక్తివంతమైన కమ్యూనిటీ.
ముత్యాల్ హత్యపై ఆయన కుమారుడు వెంకటేష్ స్పందిస్తూ ‘‘మా షాపులో ఒకసారి దొంగతనం జరిగింది. అప్పటి నుంచి ఆయన అక్కడ పడుకోవడం అలవాటు చేసుకున్నాడు. దొంగలే ఈ పని చేసుంటారని నేను అనుకుంటున్నాను. మా షాపులో చాలా డబ్బు ఎత్తుకెళ్లారు, అనేక డాక్యూమెంట్లను పాడు చేశారు. మా నాన్నను అతి కిరాతకంగా చంపారు’’ అని అన్నారు. ఇక ఇదే విషయమై పోలీసులు స్పందిస్తూ ‘‘తన అలవాటులో భాగంగా సోమవారం రాత్రి తన షాపులో పడుకున్నాడు. అయితే మంగళవారం ఉదయం నాటికి ఆయన చనిపోయి కనిపించారు. బలమైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారు’’ అని తెలిపారు.
ఈ మధ్యనే ఆయన జేడీయూ నుంచి బయటికి వచ్చారు. వచ్చీ రావడంతోనే బీజేపీ నేతలతో చర్చలు జరిపి ఆ పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. జేడీయూని వదిలినప్పటి నుంచే ఆయన బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు స్థానికులు తెలిపారు.