అయ్యో పాపం : జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగి ఆత్మహత్య

ముంబై: జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. కొన్ని నెలలుగా వారికి జీతాలు

  • Publish Date - April 28, 2019 / 01:32 AM IST

ముంబై: జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. కొన్ని నెలలుగా వారికి జీతాలు

ముంబై: జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. కొన్ని నెలలుగా వారికి జీతాలు లేవు. దీంతో తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో విషాదం జరిగింది. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగి ఆత్మహత్య  చేసుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న అతడు.. సూసైడ్ చేసుకున్నాడు.

మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలో ఈ విషాదం జరిగింది. జెట్ ఎయిర్ వేస్ లో సీనియర్ టెక్నీషియన్ గా పని చేస్తున్న శైలేష్ సింగ్ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో అతడి  కుటుంబం రోడ్డున పడింది. దీనికి తోడు క్యాన్సర్ వేధిస్తోంది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సింగ్.. తన ఇంటి టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అది 4 అంతస్తుల భవనం. సింగ్ ఆత్మహత్య జెట్ ఎయిర్  వేస్ ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు కన్నీటి పర్యంతం అయ్యారు.

కొన్ని నెలలుగా జీతాలు లేకపోవడంతో సింగ్ ఆర్థికంగా చితికిపోయాడని చెప్పారు. క్యాన్సర్ తో బాధపడుతున్న సింగ్ కీమోథెరపీ  చేయించుకుంటున్నాడు. వైద్యానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. అసలే జీతాలు లేవు, మరోవైపు క్యాన్సర్. ఈ కారణంతోనే సింగ్ చనిపోయాడని చెబుతున్నారు. జెట్ ఎయిర్ వేస్ సంక్షోభం తర్వాత ఆత్మహత్య  చేసుకున్న తొలి ఉద్యోగి ఇతడే. సింగ్ కు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.