J&K : భారీ ఉగ్రదాడికి ప్లాన్, ముగ్గురు ఉగ్రవాదుల హతం

గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.

  • Updated on- September 23, 2021 / 05:22 PM IST

Jammu

3 Terrorists Killed : భారతదేశంలోకి చొచ్చుకరావడానికి ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సరిహద్దుల వద్ద భారత జవాన్ల కళ్లు గప్పి దేశంలోకి దాడులు జరపాలన్న ఉగ్రవాదుల ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా…గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు. ప్రతిగా కాల్పులు జరపడంతో…ముగ్గురు ఉగ్రవాదాలు హతమయ్యారు. 5ఏకే గన్లు, 8 పిస్టల్స్, 70 హ్యాండ్ గ్రైనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

Read More : Gang Rape : బాలికపై 29మంది గ్యాంగ్ రేప్

పాక్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారతదేశంల భారీ ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భారత ఆర్మీ అలర్ట్ అయ్యింది. పలు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఐఈడీ (IED)టిఫిన్ బాక్స్ లో పెట్టి..పేలుడు జరపాలని కుట్ర పన్నారని, దేశంలో పండుగల సీజన్ కావడంతో రద్దీగా ఉన్న ప్రాంతాలను వీరు సెలక్ట్ చేసుకోవచ్చని సూచించింది. గత వారం పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు రామ్ లీలా సందర్భంగా..పేలుడు కోసం ప్రణాళికలు రచించగా..దీనిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం భగ్నం చేసింది. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు కూడా.