ఆకాశంలో అద్భుతం : 400 ఏండ్ల తర్వాత, గురు, శని గ్రహాలు ఒక్కటిగా, మిస్ కావొద్దు

Jupiter and Saturn to : ఆకాశవీధిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు 400 ఏండ్ల తర్వాత..ఈ దృశ్యం కనబడనున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిపెద్ద గ్రహంగా ఉన్న గురుడు, శని గ్రహాలు అత్యంత చేరువకానున్నాయి. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం సూర్యాస్తమయం తర్వాత..6.30 నుంచి 7.30 గంటల వరకు రెండు గ్రహాలు ప్రకాశవంతంగా మెరవనున్నాయి.

ఈ అద్భుత దృశ్యాన్ని టెలిస్కోప్, బైనాక్యులర్‌తో మాత్రమే స్పష్టంగా చూడొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తప్పకుండా చూడాలని..లేకపోతే..మళ్లీ…2080లో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుందని అంటున్నారు. భారత్‌లో సూర్యాస్తమయం తర్వాత..చూడొచ్చని తెలిపారు. సాయంత్రం 5.21 నుంచి రాత్రి 7.12 గంటల వరకు రెండు గ్రహాలు భూమికి దగ్గరగా వస్తాయన్నారు. పెద్దగా, ప్రకాశవంతమైన నక్షత్రంలా గురు గ్రహం కనిపిస్తుందన్నారు. గురు గ్రహం ఎడమ భాగంలో కొంచెం పైన మసకగా శని గ్రహం కనిపించనుందని తెలిపారు.

సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి గురు గ్రహానికి పట్టే సమయం దాదాపు 12 ఏండ్లు అని, అత్యంత దగ్గరగా ఒకే వరుసలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని వెల్లడిస్తున్నారు. ఈ రెండు గ్రహాలు (గురు, శని) ఎప్పుడూ ఇంత దగ్గరగా రాలేదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే..లాంగెస్ట్ నైట్..డిసెంబర్ 21వ తేదీ నుంచి 24 వరకు రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందన్నారు. కరోనా కారణంగా తగిన ర్పాట్లు చేయలేకపోయామని బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ వెల్లడిస్తున్నారు.