ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరి

  • Publish Date - August 30, 2019 / 01:41 PM IST

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేశ్వరిని నియమించారు. ఈమేరకు ఆయన్ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే గతంలో జిస్టిస్ విక్రంనాథ్ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీలిజయం సిఫారసు చేయగా.. కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును వెనక్కి తిప్పి పంపించింది. ఇప్పుడు జిస్టస్ మహేశ్వరి పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆయనకు రాజ్యాంగపరమైన పలు కేసులు వాదించిన విశిష్ట అనుభవం ఉంది. 

ప్రస్తుతం జస్టిస్ మహేశ్వరి మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా పని చేశారు. 2005లో మధ్యప్రదేశ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Also Read : పందిని ఢీకొన్న కారు.. ఎఎస్సై మృతి