×
Ad

జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయ్‌.. అంటూ రాజ్యసభలో కమల్ హాసన్ అద్భుతంగా తొలి ప్రసంగం.. వీడియో..

"ప్రజాస్వామ్య భారతం అనే మహాయంత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌.. నేను ఏం చెబుతున్నానో తెలుగు వాళ్లకి అర్థం అవుతుంది" అని అన్నారు.

Kamal Haasan

  • తమిళనాడులో SIRపై ఆందోళన వ్యక్తం చేసిన కమల్
  • రాజ్యసభలో కవితాత్మకంగా మాట్లాడిన ఎంపీ
  • ఎన్నికల గెలుపును ఓ ఆక్రమణలా భావిస్తున్నారని కామెంట్ 
  • ప్రభుత్వము శాశ్వతం కాదు, అధికారం అశాశ్వతమని వ్యాఖ్య

Kamal Haasan: మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్ రాజ్యసభలో తొలి ప్రసంగం చేస్తూ “జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌..” అని అన్నారు. ఆ సమయంలో సభ్యులు చెప్పట్లు కొట్టారు.

తమిళనాడులో ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. SIRపై కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. కవితాత్మకంగా మాట్లాడారు. తమిళనాడు ఓటర్ల హక్కులను కూడా తనిఖీ చేస్తున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వము శాశ్వతం కాదు, అలాగే అధికారం అశాశ్వతమని కమల్ చెప్పారు. ఎన్నికల గెలుపును ఓ ఆక్రమణలా భావించే రాజకీయ మార్గం నుంచి, ప్రజల అభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామ్య పాలనా దిశగా తమ మార్గాన్ని మార్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

“ఈ మార్గాన్ని మార్చుకునే క్రమంలో మీరు మాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఫలితంగా మీరు సాధించేది అసంపూర్ణమైన, చట్టవిరుద్ధమైన ఎన్నికల ఆక్రమణ మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఎవ్వరూ ఆక్రమించరు.

ప్రజాస్వామ్య భారతం అనే మహాయంత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. దయచేసి మా వెంట నడిచి ప్రజాస్వామ్య శక్తిని ముందుకు నడిపించండి లేదా ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర మార్గం నుంచి తప్పుకోండి. జగన్నాథ రథ చక్రాల్ వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌.. నేను ఏం చెబుతున్నానో తెలుగు వాళ్లకి అర్థం అవుతుంది. పోనీ.. సర్, ఇది వ్యక్తులపై లేదా ప్రభుత్వాలపై దాడి కాదు.

ఈ సభలో నా పదవీకాలంలో అలాంటిది వ్యర్థమే. ఇది ఆలోచనల మధ్య సంఘర్షణ. ఈ ప్రజాస్వామ్య మహాయంత్రం భేదాలను దాటేస్తుంది, ప్రజలను మాత్రం తొక్కకూడదు. మేమది అనుమతించం. ఎవ్వరూ అమరులు కాదు. ఏ ప్రభుత్వం శాశ్వతత్వాన్ని లక్ష్యంగా పెట్టకూడదు, పెట్టలేరు కూడా.

ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమూ అది సాధించలేదు, భవిష్యత్తులో కూడా సాధించదు. ఈ ప్రభుత్వమూ ఆ విశ్వవ్యాప్త రాజకీయ అలిఖిత (రాసిపెట్టని, అందరూ అంగీకరించే సూత్రం) నియమానికి లోబడిందే. మిత్రులారా, పిల్లలు చూస్తున్నారు. జెన్ జీ చూస్తోంది. దయచేసి అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో పాటు మనమూ పరిపక్వత సాధిద్దాం. అప్పుడు కనీసం భవిష్యత్తయినా మనదవుతుంది” అని తెలిపారు.