ఇండియా వైస్ ప్రెసిడెంట్‌ను తొలగించి వర్కర్లకు క్షమాపణలు చెప్పిన యాపిల్

Apple workers: విస్ట్రన్ కార్పొరేషన్ శనివారం డిసెంబర్ 12కు సంబంధించి ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. కర్ణాటకలోని కొలార్ జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించింది. తైవానీస్ కంపెనీకి చెందిన ఉద్యోగుల సంక్షేమం, సేఫ్టీ అనేవి అధిక ప్రాధాన్యతాంశాలు. నర్సాపురా ఫెసిలిటీలో దురదృష్టవశాత్తు వర్కర్లకు సరిగ్గా చెల్లించడం లేదు. దానికి సంతాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరుతున్నాం. ఆ ఘటన పట్ల వర్కర్లకు పూర్తి మొత్తంలో కంపన్సేటింగ్ అమౌంట్ చెల్లించాలనుకుంటున్నాం. దీని కోసం కఠినంగా శ్రమిస్తాం’ అని యాజమాన్యం చెప్పింది.

అంతేకాకుండా ఘటనపై చర్యలు తీసుకుంటూ.. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తిని వెంటనే తొలగిస్తున్నామని చెప్పింది. ‘ఇండియాలో మా బిజినెస్‌ను చూసుకుంటున్న వైస్ ప్రెసిడెంట్ ను.. వెంటనే తొలగిస్తున్నాం. మా ప్రోసెస్ ను వెంటనే మొదలుపెడతాం. ఇటువంటి పరిస్థితులు మళ్లీ జరగకుండా.. పూర్తి చర్యలు తీసుకుంటాం’ అని ఐ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరర్ చెప్పింది.

ఫెసిలిటీ వద్ద వర్కర్లకు సహకారం అందించే ప్రోగ్రాంను మొదలుపెట్టాం. ఇది మళ్లీ జరగకుండా చూసుకుంటాం. అని కంపెనీ చెప్పింది. అంతకంటే ముందు కంపెనీ తాము రూ.52కోట్లు నష్టపోయినట్లు కన్ఫామ్ చేసింది. ఆ రోజు జరిగిన హింసాత్మక ఘటనలో ఎటువంటి మెటేరియల్ డ్యామేజి జరగలేదని.. లోకల్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు.

ఈ ఘటన డిసెంబర్ 12న కోలార్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరిగింది. 43ఎకరాల్లో కట్టిన ఐ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బెంగళూరుకు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్మార్ట్‌ఫోన్ ఎస్ఈలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొడక్ట్స్, బయోటెక్ డివైజ్‌లను రెడీ చేస్తారు.