అమ్మాయిని ర్యాగింగ్ చేశారనీ..బాయ్స్ హాస్టల్‌పై ఇనుప రాడ్లతో 20మంది దాడి..

  • Publish Date - February 24, 2020 / 06:25 AM IST

ఓ అమ్మాయిని ర్యాగింగ్‌ చేశారని.. ఆమె సన్నిహితులు బాయ్స్‌ హాస్టల్‌లోకి వెళ్లి నానా రభసా చేశారు. హాస్టల్‌ కొచ్చి ఇష్టమెచ్చినట్లుగా  రెచ్చిపోయారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కర్ణాటకలోని బెల్గాంలో ఫిబ్రవరి 23న జరిగింది. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ పోస్టు మెట్రిక్‌ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు విద్యార్ధులు ఓ అమ్మాయిని ర్యాగింగ్ చేశారు. దీంతో  బాధితురాలు మనస్తాపానాకి గురైంది. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె తన సన్నిహితులకు చెప్పుకుని ఏడ్చింది. ఆమె ఏడుపుని చూసి ర్యాగింగ్ కు పాల్పడినవారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.  

తరువాత 20 మంది అబ్బాయిలు ఇనుపరాడ్లు, కర్రలు, బ్యాట్‌లు..ఇలా చేతికి ఏది దొరికితే అది పట్టుకుని హాస్టల్‌లోకి చొరబడ్డారు. హాస్టల్‌ ఫర్నిచర్‌తో పాటు హాస్టల్ లో పార్క్ చేసి ఉణ్న బైక్‌లు, స్కూటర్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో హాస్టల్ లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ హడలిపోయారు. ఈ ఘటనపై హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హాస్టల్ లో ఉండే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తిస్తున్నారు. తరువాత వారి కోసం గాలిస్తున్నారు.