మండ్యా విజేత ఎవరు : నామినేషన్ వేసిన సీఎం కొడుకు

కర్ణాకటలోని మండ్యా లోక్ సభ స్థానానికి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019) నామేనేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సమయంలో నిఖిల్ వెంట ఆయన తల్లి,మంత్రులు హెచ్ డి రేవణ్ణ,డీకే శివకుమార్,తదితరులు ఉన్నారు.ఇప్పటికే మండ్యా స్థానానికి ఇండిపెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రచారంలో నటి సుమలత దూసుకెళ్తుంది.కన్నడ అగ్రహీరోలు యష్,దర్శన్ తదితరులు ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే ఎవరెన్ని ప్రచారాలు చేసిన మండ్యాలో విజయం తమదే అని సీఎం కుమారస్వామి ధీమాగా ఉన్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న మండ్యా నుంచి సీఎం తన కుమారుడిని రంగంలోకి దించడం,మరోవైపు బీజేపీ మండ్యాలో అభ్యర్థిని పెట్టకుండా సుమలతకు మద్దతివ్వడం వంటి పరిణామాలు ఇప్పుడు మండ్యాలో ఎన్నికల వేడిని పెంచుతున్నాయి.