Chikmagalur School : కర్ణాటకలో స్కూల్ లో కరోనా కల్లోలం..101మంది విద్యార్థులకు పాజిటివ్
ఓ వైపు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో కర్ణాటకలోని ఓ స్కూలో రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
- venkaiahnaidu
- Updated on- December 7, 2021 / 07:01 AM IST
School
Chikmagalur School : ఓ వైపు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”వ్యాప్తి గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో కర్ణాటకలోని ఓ స్కూలో రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. విద్యార్థులతో పాటు పెద్ద ఎత్తున టీచర్లు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు.
చిక్కమంగళూరులోని సిటీలోని జవహార్ నవోదయ స్కూల్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆదివారం ఈ స్కూల్ లో కోవిడ్ కేసుల సంఖ్య 69 కాగా,సోమవారం మరో 32 మందికి పాజిటివ్‌గా తేలడంతో ఈ సంఖ్య 101కి చేరింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 457 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా ఈ కేసులు బయటపడినట్లు అధికారులు తెలిపారు.
కరోనా సోకిన వారిలో 90మంది విద్యార్థులు, 11 మంది స్టాఫ్ ఉన్నారని అధికారులు తెలిపారు. వీరందరి శాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్లు చిక్కమంగళూరు జిల్లా ఆరోగ్య అధికారి ఉమేశ్ చెప్పారు. కోవిడ్ కలకలం నేపథ్యంలో ఇప్పటికే స్కూల్ ని సీజ్ చేసిన అధికారులు విద్యార్థులకు ట్రీట్మెంట్ కోసం వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అక్కడ మోహరించారు. రూమ్స్ ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు.
ALSO READ Next pandemic : రాబోయే వైరస్ లు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చు!
