Next pandemic : రాబోయే వైరస్ లు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చు!

ప్రస్తుత కోవిడ్-19 కన్నా భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు మ‌రింత ప్రాణాంత‌కంగా ఉంటాయ‌ని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తలలో ఒకరైన ప్రొఫెస‌ర్ డేమ్ సారా గిల్బ‌ర్ట్

Next pandemic : రాబోయే వైరస్ లు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చు!

Sara (1)

Next pandemic  ప్రస్తుత కోవిడ్-19 కన్నా భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు మ‌రింత ప్రాణాంత‌కంగా ఉంటాయ‌ని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తలలో ఒకరైన ప్రొఫెస‌ర్ డేమ్ సారా గిల్బ‌ర్ట్ హెచ్చరించారు. కరోనా నుండి నేర్చుకున్న పాఠాలను మర్చిపోకూడదని, తదుపరి వైరస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రపంచం నిర్థారించుకోవాలని ఆమె చెప్పారు.

సోమవారం బ్రిటన్ లో జరిగిన 44వ రిచ‌ర్డ్ డింబ్లేబీ లెక్చ‌ర్ స‌ద‌స్సులో పాల్గొన్న సారా గిల్బ‌ర్ట్ మాట్లాడుతూ…”నిజం ఏమిటంటే, భవిష్యత్తులో వచ్చే వైరస్ లు మరింత విధ్వంసకరంగా ఉండవచ్చు. అది మరింత అంటువ్యాధి కావచ్చు, లేదా మరింత ప్రాణాంతకం కావచ్చు లేదా రెండూ కావచ్చు. మన జీవితాలను, మన జీవనోపాధికి ముప్పు కలిగించే వైరస్ ఇదే చివరిది కాదు. తదుపరి వైరస్ ను ఎదర్కొనేందుకు ప్రపంచం మెరుగ్గా సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. వైర‌స్‌ల‌పై పోరాటంలో ఎంతో ప్ర‌గ‌తి సాధించాం. ఆ జ్ఞ‌నాన్ని వ‌ద‌లుకోవ‌ద్దు. మ‌హ‌మ్మారుల‌ను ఎదుర్కొనేందుకు మ‌రింత తీవ్ర స్థాయిలో ఫండింగ్ అవ‌స‌ర‌ం”అని అన్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ గా ఉన్న సారా గిల్బర్ట్ ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రపంచాన్ని ఒమిక్రాన్ గురించి కూడా మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్ యొక్క స్పైక్ ప్రొటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనలు ఉన్నాయని చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌పై త‌క్కువ ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ గురించి మరింత తెలిసే వరకు, జాగ్రత్తగా ఉండాలని, ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రపంచదేశాలకు సూచించారు.

ఇక,కరోనా కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా  52లక్షల మందికి పైగా మరణించారు.

ALSO READ Omicron In India : భారత్ లో 23కు చేరిన ఒమిక్రాన్ కేసులు..ముంబైలో మరో ఇద్దరికి సోకిన వైరస్