CM జగన్‌ గారూ..తప్పు చేస్తున్నారు : కర్ణాటక మంత్రి

  • Publish Date - January 30, 2020 / 10:08 AM IST

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలన్న.. ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంపై ఏపీలోనే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తోంది. జగన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ కర్ణాటక విద్యాశాఖా మంత్రి సురేష్‌ కుమార్‌ లేఖ రాశారు. 

అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంగా మార్చటం వల్ల రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటున్న విద్యార్థులు ఇబ్బందులు పడతారంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో ఉండే స్కూల్స్ లో విద్యార్ధులు ఇప్పటి వరకూ కన్నడ భాషలోనే ఉండేదనీ టీచింగ్ కూడా కన్నడలోనే ఉండేదని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వల్ల వారు ఇబ్బందులు పడతారనీ వారి మనోస్థైర్యం దెబ్బతింటుందని తెలిపారు.

కన్నడను ఒక భాష మాధ్యమంగా బోధించే మైనారిటీ భాషా స్కూళ్లను కొనసాగించడం ద్వారా మీ రాష్ట్రంలోని కన్నడిగుల ఆసక్తిని కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను” అని కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి ఎస్.సురేశ్  కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. కాగా..ఇప్పటికే జగన్‌ నిర్ణయంపై ఏపీలో భాషావేత్తలు, ప్రముఖుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.