ఉల్లి రేటు..పోటు : గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళన 

  • Publish Date - November 6, 2019 / 08:01 AM IST

ఉల్లిపాయల ధరలు కొనేవారినే కాదు పండించే రైతులను కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి. ఓ పక్క మార్కెట్లలో ఉల్లి ధరలకు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.80 నుంచి 100లు పలుకుతున్నాయి. మరోపక్క ఉల్లి రైతులు మాత్రం మాకు గిట్టుబాటు ధర కావాలని ఆందోళన బాట పడుతున్నారు. ఇలా ఉల్లి కొన్నవారినే కాదు..పండించినవారిని కూడా ఏడిస్తోంది. కర్ణాటకలోని గడగ్ లో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తు రోడ్లపై ఆందోళన చేపట్టారు.

వినియోగదారులకు రైతులకు మధ్య ఉండే దళారులు ఉల్లిపాయల సమస్యలను పెద్దది చేసిన డబ్బులు దండుకుంటున్నారనీ అంటున్నారు. కష్టపడి పండించే రైతులకు నామమాత్రపు ధర ఇచ్చి దళారులు మాత్ర భారీ ధరలకు అమ్ముకుంటున్నారనీ..తమకు డిమాండ్ కు తగిన ధర రావటంలేదని ఉల్లి రైతులు వాపోతున్నారు. 

గంగాధర్ హిరేమాట్ అనే ఉల్లి రైతు మాట్లాడుతూ..బస్తా ఉల్లిపాలయలు రూ. 4వేల 500లు  ధర ఉంటే రూ.200 నుంచి 300లకు మించి మధ్యవర్తులు  ఇవ్వనంటున్నారనీ వాపోయారు. తమకు కనీసం మార్కెట్ లోకి  కూడా రానివ్వటంలేదనీ..ఉల్లి రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని తమకు మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 
దీనిపై స్థానిక మాజీ ఎమ్మెల్యే బీఆర్ యవగా మాట్లాడుతూ..ఉల్లి సమస్యల గురించి ప్రభుత్వం స్పందించాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని..ఉల్లి ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని కోరారు.