Hijab Row In Ap (1)
Hijab Row: హిజాబ్ ఆందోళనలో భాగంగా కర్ణాటకలోని ఓ కాలేజీలో స్వతహాగా రాజీనామా చేసింది లెక్చరర్. కాలేజీలోకి ఎంటర్ అయ్యే ముందు హిజాబ్ తీసేయాలని చెప్పడం నా ఆత్మాభిమానానికి దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. తూమకూరులోని జైన్ పీయూ కాలేజీలో లెక్చరర్ అయిన ఛాందినీ మూడేళ్ల పాటు అదే ఉద్యోగంలో ఉండి తొలిసారి కాలేజీ యాజమాన్యం ఆదేశాలు తనకు నచ్చకపోవడంతో రాజీనామా ప్రకటించారు.
‘మూడేళ్లుగా జైన్ పీయూ కాలేజీలో పనిచేస్తున్నా. ఇప్పటివరకూ ఎటువంటి సమస్యలు రాలేదు. నిన్న మా ప్రిన్సిపాల్ హిజాబ్ ధరించకూడదని లేదా టీచింగ్ సమయంలో ఎటువంటి మతపరమైన గుర్తులు ధరించకూడదని చెప్పారు. కానీ, మూడేళ్లుగా హిజాబ్ ధరించే టీచింగ్ చేస్తున్నా. ఈ కొత్త నిర్ణయం నా ఆత్మభిమానాన్ని దెబ్బతీసింది. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా’ అని మీడియాకు చెప్పింది.
కర్ణాటకలోని స్కూల్స్, కాలేజీలు వారాల తరబడి హిజాబ్ విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇప్పటికే హిజాబ్ ఆందోళనలు, సూచనలు చాలానే జారీ చేసింది హైకోర్టు.
Read Also: హిజాబ్ వివాదం.. కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
గతేడాది ఆరుగురు స్టూడెంట్లు హెడ్ స్వార్ఫ్ ధరించి క్లాసులకు అటెండ్ కాకూడదని అడ్డుకోవడంతో ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ కండువాలు అంశం తెరపైకి రావడంతో ఆందోళనలు వ్యాప్తి చెందాయి. దీన్ని అదుపులోకి తెచ్చేందుకు మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూసేశారు. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరుపుతూ.. విచారణ జరుగుతున్నంతసేపు ఎటువంటి మతపరమైన దుస్తులు, గుర్తులు వాడకూడదని నిబంధన విధించింది.