కర్ణాటక లాక్ డౌన్ కఠినతరం…మే-3వరకు ఎలాంటి సడలింపుల్లేవ్
- venkaiahnaidu
- Published On : April 20, 2020 / 09:04 AM IST
కర్ణాటకలో మే-3వరకు లాక్ డౌన్ యథావిధిగా జరుగుతందని,ఎటువంటి సడలింపులు ఉండబోవని యడియూరప్ప ప్రభుత్వం సృష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి సడలింపులు ఉండకూడదని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది.
కర్ణాటకలో ఇప్పటివరకు 384 కరోనా కేసులు నమోదవగా,14మరణాలు నమోదయ్యాయి. 104మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా,దేశంలో మొదటి కరోనా మరణం నమోదైన కర్ణాటకలోని కలబుర్గిలో ఇవాళ కొత్తగా 5కరోనా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ఢిల్లీలో కూడా మే-3వరకు కూడా లాక్ డౌన్ నుంచి ఎటువంటి సడలింపు ఉండవని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ,ఉత్తరప్రదేశ్,బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ నుంచి పాక్షిక్ష సడలింపు ఇవ్వాలని నిర్ణయించాయి. నేటి నుంచి కొన్ని పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతులిచ్చాయి.
