Karnataka: కోటి కొవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులను రూ.400కోట్లతో కొనుగోలు చేసిన కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం గురువారం కొవీషీల్డ్ వ్యాక్సిన్ కోటి డోసులను రూ.400కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాలని నిర్ణయించి..

Karnataka To Purchase 1 Crore Doses Of Covishield Vaccine For ₹ 400 Crore

Karnataka: కర్ణాటక ప్రభుత్వం గురువారం కొవీషీల్డ్ వ్యాక్సిన్ కోటి డోసులను రూ.400కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అప్రూవల్ కూడా దొరికింది. ఈ వ్యాక్సిన్ ను 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్కులకు ఇవ్వాలని నిర్ణయించింది.

పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)నే కొవీషీల్డ్ వ్యాక్సిన్ ను తయారుచేస్తుంది. వ్యాక్సినేషన్ మూడో ఫేజ్ లో భాగంగా దేశవ్యాప్తంగా డ్రైవ్ నిర్వహించాలని ప్లాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ మే1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.

గవర్నమెంట్ కు అమ్మేవారికి ఎగుమతిదారులకు ధరల్లో స్వేచ్ఛను ఇచ్చారు. ఈ మేరకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కో డోస్ రూ.400, ప్రైవేట్ హాస్పిటల్స్ కు అయితే రూ.600కు అమ్మాలని నిర్ణయించింది.

ఆరు రోజుల తర్వాత గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన యడ్యూరప్ప.. మహమ్మారి పరిస్థితి అదుపుచేయలేకుండా మారిందని అన్నారు. గురువారం సాయంత్రం మంత్రులతో కలిసి సమావేశమైన ఆయన.. నగరంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.

మీటింగ్ లో ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర.. ఆక్సిజన్ సప్లైలో, మెడిసిన్ అందివ్వడంలో కొరతను తీర్చినట్లు సీఎంఓ డేటా రిలీజ్ చేసింది. దాంతో పాటు వ్యాక్సిన్ కొరత ఏమీ లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. నగరంలో ఫీవర్ క్లినిక్ లను బలోపేతం చేయాలని.. సరైన గైడెన్స్ ఉంటే హాస్పిటలైజ్ కాకుండానే బయటపడొచ్చని సూచించారు.