కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం (ఆగస్ట్ 24, 2019)న ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. కొద్దికాలంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అరుణ్‌జైట్లీ మరణంపై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Hon’ble CM Sri KCR has expressed shock over the demise of former Union Minister Sri Arun Jaitley Ji. CM recollected services rendered by Arun Jaitley to the nation and prayed that his soul may rest in peace. CM conveyed his condolences to the members of the bereaved family.
— Telangana CMO (@TelanganaCMO) August 24, 2019
జైట్లీ మరణ వార్తపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. జైట్లీ మరణ వార్త విని ఎంతో బాధ కలిగిందని.. 40 సంవత్సరాలపాటు జైట్లీ తన జీవితాన్ని రాజకీయాల్లోనే గడిపారని జగన్ పేర్కొన్నారు. ఈ కాలంలో ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Sorry to hear about the demise of #ArunJaitley ji, an articulate, intellect and affable leader. In his 4-decade long political career, he made notable contributions in the service of nation and stood up for values. My prayers are with his family and friends in this hour of grief.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2019