Kerala Temple : దేవుడికి నైవేద్యంగా ‘మంచ్ చాక్లెట్’.. ఈ ఆలయం కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Kerala Temple Offer Munch Prasad : కేరళలోని అలప్పుజ జిల్లా తలవాడిలో ఉన్న తెక్కన్ పళని బాలసుబ్రహ్మణ్య ఆలయంలో బాల మురుగన్‌కు మంచ్ చాక్లెట్‌ను నైవేద్యంగా సమర్పించే ప్రత్యేక సంప్రదాయం కొనసాగుతోంది.
- Harish Thanniru
- Updated on- August 27, 2026 / 08:45 PM IST
Kerala Temple Offer Munch Prasad
Kerala Temple Offer Munch Prasad : హిందూ దేవాలయాల్లో దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం, పులిహోర, దద్దోజనం వంటివి నైవేద్యాలుగా సమర్పిస్తారు. కొన్ని ఆలయాల్లో లడ్డూ, నెయ్యి, వెన్న వంటి పదార్థాలనుకూడా నైవేద్యాలు అందజేస్తారు. అయితే, కేరళలోని ఓ ఆలయంలో వింత ఆచారం కొనసాగుతోంది. ఇక్కడి ఆలయంలో మంచ్ చాక్లెట్ ను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ మహిళా భక్తురాలు సోషల్ మీడియా పోస్టు చేయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Nepal Floods : వామ్మో.. నేపాల్ టైప్‌లో ముంచెత్తే ప్రాంతాలు మనకి కూడా ఉన్నాయా..!
కేరళలోని అలప్పుజ జిల్లా తలవాడిలో ఉన్న తెక్కన్ పళని బాలసుబ్రహ్మణ్య ఆలయంలో ఈ ప్రత్యేక సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ కొలువైన బాల మురుగన్‌కు భక్తులు ముంచ్ చాక్లెట్‌ను సమర్పిస్తారు. అనంతరం పూజ చేసిన చాక్లెట్లనే భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. సాధారణ ఆలయంలాగే కనిపించే ఈ దేవాలయంలో వెళ్లిన తర్వాత ముంచ్ చాక్లెట్ ప్రసాదంగా లభించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. ఒక చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అతని కుటుంబం బాల మురుగన్‌కు ముంచ్ చాక్లెట్‌ను నైవేద్యంగా సమర్పించిందని చెబుతారు. ఆ తర్వాత ఆ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడిందనే నమ్మకం ఏర్పడింది. దీంతో ముంచ్ చాక్లెట్‌ను స్వామివారికి సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చెబుతున్నారు.
కాలక్రమేణా ఈ ఆచారం భక్తుల్లో ప్రాచుర్యం పొందింది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ముంచ్ చాక్లెట్లను స్వామివారికి సమర్పించడం ప్రారంభించారు.
ఈ ప్రత్యేక నైవేద్యం కారణంగా బాల మురుగన్‌ను కొందరు భక్తులు ‘ముంచ్ మురుగన్’ అని కూడా పిలుస్తున్నారు. ఆలయంలో ముంచ్ చాక్లెట్లను నైవేద్యంగా సమర్పించడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా మారింది. కొన్ని కథనాల ప్రకారం.. ఆలయంలోని పెద్ద పాత్రలో ముంచ్ చాక్లెట్లను నింపి స్వామివారికి సమర్పించే ప్రత్యేక నైవేద్యాన్ని కూడా నిర్వహిస్తారు. దీనిని భక్తులు ‘ముంచ్ పారా’గా పేర్కొంటారు.
