Poorakkali (1)
Kerala Temple: ఓ కళాకారుడి కొడుకు ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడనే కారణంతో టెంపుల్ కమిటీ ఆ కళాకారుడిని గుడిలోకి రానివ్వలేదు. కేరళలోని కన్నూర్ జిల్లాలోని కనియన్ పరంబాత్ భగవతి టెంపుల్ లో ఈ ఘటన జరిగింది.
టెంపుల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ పానకర్ అనే వ్యక్తి తన కొడుకు ముస్లిం యువతిని పెళ్లాడాడు. ఆ కారణంతోనే సంప్రదాయ నృత్యమైన పూరక్కలీ డ్యాన్స్ చేయడానికి అనర్హుడంటూ 37ఏళ్లుగా పాటిస్తున్న సంప్రదాయం నుంచి పక్కకుబెట్టేశారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మార్షియల్ ఆర్ట్స్ కలారిపయాట్టును గుర్తు చేసుకుంటూ ఈ నృత్య ప్రదర్శనను కొనసాగిస్తున్నారు.
నార్త్ కేరళలో భాగవతి మాతకు అంకితం ఇచ్చేందుకు ప్రముఖ దేవాలయాల్లో ఈ ప్రదర్శన చేస్తుంటారు. తొమ్మిది రోజుల పండుగల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్లుంటారు. రిథమిక్ గా కాళ్లు కదుపుతూ కలారిపయట్టుకు మూమెంట్స్ చేస్తుంటారు.
Read Also: ట్రాన్స్‌జెండర్‌తో కొడుక్కి ప్రేమ వివాహం జరిపించిన పేరెంట్స్
పూరక్కాలీ నృత్యాన్ని పూరమ్ రోజున చేస్తారు. ఒరిజినల్ డ్యాన్స్్ ను ఆడవాళ్లు మాత్రమే చేసేవాళ్లు. కాలంతో పాటు మారి పురుషులే ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ డ్యాన్సింగ్ చేసేస్తున్నారు. రామాయణ, మహాభారతాల నుంచి తీసుకున్న కథలతోనే పాటలుగా రాసుకొని పర్‌ఫామ్ చేస్తుంటారు.
‘నేను పూరక్కలీ ఆర్టిస్‌ని. 37ఏళ్లుగా ఇదే పనిలో ఉన్నా. నా కొడుకు ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయనివ్వడం లేదు’ అంటూ వాపోతున్నారు. ఇందులో ఒక మినహాయింపు కూడా ఇచ్చారట. ఒకవేళ కుటుంబం మొత్తాన్ని వదిలేసి వస్తే పూరక్కాలీ డ్యాన్స్ చేసేందుకు అనుమతిస్తామని టెంపుల్ ఆఫర్ ఇచ్చింది.
‘ఇదే పని చేయాలని నాకు ఆసక్తి ఎక్కువ. దీని వల్ల అప్పుడప్పుడు అదనపు ఆదాయం కూడా వచ్చేది అని ‘ పానిక్కర్ అంటున్నారు.