నో సౌండ్ నో పొల్యూషన్ : ఆటోకు పోటీ E-త్రీ వీలర్

  • Publish Date - September 19, 2019 / 04:54 AM IST

రోజు రోజుకు పెరిగిపోతున్న వాహనాల వినియోగం.. ప్రమాదంగా మారుతున్న కాలుష్యం.. అనారోగ్యాలకు గురవుతున్న ప్రజలు. వెరసి E-వాహనాల వినియోగం అవసరంగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్తులో అంతా E-వాహనాలదేనని అంటున్నారు వాహనాల విశ్లేషకులు.

సౌండ్ పొల్యూషన్, వాతావరణ పొల్యూషన్ లేని E-వాహనాల తయారీపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ సైంటిస్టులో కొత్త  E-వాహనాన్ని తయారు చేశారు. భవిష్యత్‌లో ఆటోలు, ఈ-రిక్షాలకు ఇది గట్టిపోటీ ఇస్తుందని ఐఐటీకే మెకానికల్‌ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్‌ విక్రాంత్‌ రేచర్ల తెలిపారు.

వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో, ఐఐటి ఖరగ్‌పూర్‌కు చెందిన 50 మంది స్టూడెంట్స్  ఎలక్ట్రిక్ వెహికల్‌ను తయారు చేసారు. దీనికి ‘దేష్లా’ అని పేరు పెట్టారు. శక్తివంతమైన మోటార్‌తో కూడిన ఈ వెహికల్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది.

ఇప్పటికే దీన్ని టెస్టింగ్ విజయవంతమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా..ఈ వాహనం కచ్చితంగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వాహనాలకు పోటీ అవుతుందని ఈ టీమ్ కు నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ విక్రాంత్‌ రేచర్ల ధీమా వ్యక్తంచేశారు.