Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్
తన ప్రాణాలకు భయం ఉందని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది.
- bheemraj
- Published On : July 3, 2022 / 07:52 AM IST
Nupur Sharma
Nupur Sharma : బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మపై కోల్‌కతా పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆమెను అమ్‌హెరెస్ట్, నార్కెల్‌దంగా పోలీస్‌స్టేషన్ల ఎదుట హాజరుకావాలని కోరారు. అయితే ఇప్పటి వరకు ఆమె హాజరుకాకపోగా.. మరింత సమయం కోరింది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
తన ప్రాణాలకు భయం ఉందని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసును పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అయితే పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court : దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం..
ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల తర్వాత దేశంలో జరుగుతున్న ఘటనలకు ఆమె బాధ్యురాలని మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. FIR నమోదైనా.. అరెస్టు కాకపోవడం ఆమె పలుకుబడిని సూచిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
