ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ లక్షణాలతో దేశంలో ఇప్పటి వరకు నిర్ధారణ అయినవారి సంఖ్య 39కి చేరింది. తాజాగా కరోనా లక్షణాలతో లద్దాఖ్‌లో ఒకరు, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ లో ఒకరు మృతి చెందారు. శనివారం స్థానిక ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటునే ఆదివారం చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 40కి చేరింది.
వివరాలు.. లడఖ్‌కు చెందిన మాజీ పోలీస్ మొహమద్ అలీ (76)ని మూత్రనాళ సమస్యలతో, ముర్షీదాబాద్ వ్యక్తి తీవ్ర మధుమేహంతో బాధపడుతూ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా లేహ్ ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ మోతిప్ దోర్జీ మాట్లాడుతూ.. అలీ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌తో చనిపోయాడని తెలిపారు. గతంలో కూడా అనారోగ్యానికి గురయ్యాడన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అతడి నమూనాలను ఢిల్లీకి పంపామని వివరించారు. అక్కడ వైద్య బృందంతో టచ్‌లో ఉన్నామని, రెండు రోజుల్లో నివేదిక వస్తుందన్నారు.(కరోనాను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్లు)
హైల్త్ సర్వీస్ డైరెక్టర్ అజయ్ చక్రవర్తి మాట్లాడుతూ.. బాధితుడు షుగర్ పేషెంట్ అని, ఇన్సులిన్ తీసుకుంటున్నాడని తెలిపారు. సౌదీ నుంచి వచ్చిన అతని దగ్గర ఇన్సులిన్ కోసం డబ్బులు లేవని అన్నారు. అయితే చికిత్స కోసం వచ్చిన అతడిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలోని ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూనే మృతి చెందాడని, బ్లడ్ టెస్ట్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.