Lalu Prasad Yadav: నేడు లాలూకు కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె… తండ్రి గురించి ఎమోషనల్ ట్వీట్ చేసిన రోహిణి
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. సోమవారం ఆమె కిడ్నీ దానం చేయబోతున్నారు.
- Narender Thiru
- Published On : December 5, 2022 / 12:39 PM IST
Lalu Prasad Yadav: అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయనున్న సంగతి తెలిసిందే. సోమవారమే ఆమె తన కిడ్నీ దానం చేయబోతున్నారు. సింగపూర్‌లో ఈ శస్త్ర చికిత్స జరగబోతుంది. ఇప్పటికే లాలూ అక్కడికి చేరుకున్నారు.
Uttarakhand: విషపూరిత గింజలు తిన్న నలుగురు చిన్నారులు.. ముగ్గురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
ప్రస్తుతం లాలూ, ఆయన కుమార్తె రోహిణి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్సకు ముందు రోహిణి ఆస్పత్రి నుంచి బెడ్ మీద నుంచి ఒక ట్వీట్ చేశారు. కిడ్నీ దానానికి అంతా సిద్ధంగా ఉందని, తనకు మంచి జరగాలని ఆశీర్వదించాలంటూ ఆమె ట్వీట్ చేశారు. అలాగే.. మనం దేవుడ్ని చూడలేదని, కానీ, తన తండ్రిలోనే ఆ దేవుడిని చూశానని మరో ట్వీట్ చేశారు. గతంలో కూడా రోహిణి తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పారు. వాళ్లిద్దరూ తనకు దేవుళ్లని, వాళ్ల కోసం ఏదైనా చేస్తానని చెప్పారు. రోహిణి లాలూ రెండో కుమార్తె. రోహిణి నుంచి కిడ్నీ సేకరించిన తర్వాత వైద్యులు లాలూకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు.
Telangana: కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని ఏడాది వయసున్న చిన్నారి మృతి
బిహార్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన లాలూ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, ఆయన అనారోగ్యం రీత్యా వైద్య చికిత్స తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఆయన కిడ్నీ మార్పిడి చికిత్స కోసం కోర్టు అనుమతితో సింగపూర్ చేరుకున్నారు.
Ready to rock and roll ✌️
Wish me a good luck ? pic.twitter.com/R5AOmFMW0E— Rohini Acharya (@RohiniAcharya2) December 5, 2022
