Uttarakhand: విషపూరిత గింజలు తిన్న నలుగురు చిన్నారులు.. ముగ్గురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

చిన్నారులు తోటలో ఆడుకుంటుండగా వారికి చిక్కుడులాంటి గింజలున్న మొక్క కనిపించింది. వెంటనే పిల్లలు వాటిని తిన్నారు. నలుగురు పిల్లలు ఈ గింజలు తినగా, వారిలో ముగ్గురు మరణించారు.

Uttarakhand: విషపూరిత గింజలు తిన్న నలుగురు చిన్నారులు.. ముగ్గురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Uttarakhand: సరదాగా తోటలో ఆడుకుంటూ, కనిపించిన ఒక మొక్క నుంచి తీసిన గింజలు తిన్న చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారులు విషపూరిత గింజలు తినగా, అందులో ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌, హరిద్వార్ జిల్లా, బుగ్గవాలా ప్రాంతంలో ఇటీవల జరిగింది.

Love Jihad: అవసరమైతే ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం: శివరాజ్ సింగ్ చౌహాన్

గత బుధవారం సాయంత్రం షబ్నమ్ (5), షాజియా (5), బసిర్, ఆసిఫా అనే పిల్లలు తమ ఇంటి దగ్గర గల తోటలో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి పన్వర్ అనే విషపూరిత మొక్క కనిపించింది. దీనికి చిక్కుడులాంటి గింజలు ఉన్నాయి. అవి కూడా విషపూరితమైనవే. అయితే, ఆ విషయం తెలియకపోవడంతో పిల్లలు వాటిని తిన్నారు. తర్వాత ఇండ్లకు వెళ్లిపోయారు. కానీ, కొద్దిసేపటికే పిల్లల్లో తీవ్రమైన వాంతులు, విరేచనాలు వంటివి మొదలయ్యాయి. వెంటనే ఆందోళనకు గురైన చిన్నారుల కుటుంబ సభ్యులు వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే, వారిలో షబ్నమ్ చికిత్స పొందుతూ గురువారం మరణించింది.

ఆ తర్వాతి రోజు షాజియా మరణించగా, ఆదివారం బసిర్ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆసిఫా డెహ్రడూన్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆసిఫా పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కాగా, ఇంత మంది పిల్లలు మరణించినప్పటికీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆ ప్రాంతంలోని పన్వర్ మొక్కల్ని ధ్వంసం చేయించినట్లు చెప్పారు.