నితీశ్ కుమార్ ర్యాలీలో ‘లాలూ జిందాబాద్’ నినాదాలు, తిక్కరేగేసరికి…

Nitish Kumar:బీహార్ సీఎం Nitish Kumarకు మరోసారి అవమానం జరిగింది. ఎన్నికల ర్యాలీ చేస్తుండగా లాలూ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అవి విన్న ముఖ్యమంత్రి స్పీచ్ మధ్యలో ఆపేసి నినాదాలు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు’ అంటూ స్పీచ్ ఆపేసి ప్రజలపై అరవడం మొదలుపెట్టారు. చంద్రికా రాయ్ గురించి ప్రచారం చేస్తున్న సీఎంకు మధ్యలో ఆటంకం వచ్చింది.



‘కొంచెం చెయ్యెత్తండి, ఈ చెత్త వాగుడంతా ఎందుకు మాట్లాడుతున్నారు’ అని సీఎం ప్రజలను డిమాండ్ చేశారు. అంతటితో నినాదాలు ఆగిపోగా.. గుంపులోకి మరొకరు అందరూ దాణా దొంగలే అంటూ లాలూ ప్రసాద్‌ను ఉద్దేశించి నాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చిన దాని గురించి ఎత్తిచూపాడు.
https://10tv.in/baba-ramdev-falls-off-elephant-while-performing-yoga-watch-viral-video/
ర్యాలీలో జరుగుతున్న అల్లర్లపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇక్కడ రచ్చ చేయకండి. నాకు ఓటు వేయకపోతే వదిలేయండి’ అని సీఎం అన్నారు. ఆ తర్వాత గుంపు గురించి మాట్లాడుతూ.. జేడీయూ ర్యాలీలో ఇలా నినాదాలు చేయడానికి మీకు అనుమతి ఉందా.. అని ప్రశ్నిస్తుండగా మరోసారి సీఎంకు వ్యతిరేకంగా గుంపులో నుంచి నినాదాలు వినిపించాయి.

మీరు ఇక్కడకు ఇలా ఉండడానికి కారణమైన వ్యక్తిని.. అతనికి వేసిన ఓట్లను అవమానించకండి అంటూ సెంటిమెంటల్ టచ్ ఇచ్చారు నితీశ్ కుమార్.. ఇంకా ఆపకపోయే సరికి మీకు చంద్రికారాయ్ ఎవరో తెలియదా అంటూ ప్రశ్నించారు.