జార్ఖండ్ రాజధాని రాంచీలో న్యాయ విద్యార్థిని ఏకంగా 12మంది దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ( నవంబర్ 26)జరిగిన ఈ దారుణం ఆలస్యంగా తెలిసింది. కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో గురువారం సాయంత్రం 5:30 గంటలకు 25 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని తన ఫ్రెండ్‌తో కలిసి ఉంది. అదే సమయంలో అక్కడకు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గన్ తో ఆమెను బెదిరించి లాక్కెళ్లిపోయారు. తరువాత 12 మంది దుర్మార్గులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్‌లో పెట్రోల్ అయిపోయింది. దీంతో సదరు దుర్మార్గులు వారి స్నేహితులకు ఫోన్ చేశారు. అనంతరం కారులో వచ్చిన కొందరు, వీరిద్దరూ కలిసి ఆమెను తిని బ్రిక్ కిల్న్ ఏరియాకు తీసుకెళ్లారు. అక్కడ మొత్తం 12 మంది కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 27న ఉదయం తీవ్ర గాయాలతో బాధితురాలు పోలీసు స్టేషన్‌కు అతి కష్టంమీద వచ్చి ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి నుంచి పోలీసులు కారు, బైక్ తో పాటు ఓ తుపాకీ, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా బాధితురాలిని అత్యాచారం జరిగిన ప్రాంతం జార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వీఐపీ జోన్ పరిధిలోకి ఉంది. ఆమె చదువుతున్న లా కాలేజీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. డీజీపీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసాలు కూడా కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఇంత హై-సెక్యూరిటీ జోన్ సమీపంలో కూడా ఓ యువతిపై ఇంతటి దారుణానికి పాల్పడటం గమనించాల్సిన విషయం.
తెలంగాణాలోపుట్టిన రోజునాడే గ్యాంగ్ రేప్ కు గురైన మానస..వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఒకే రోజులో జరిగిన దారుణాలు సంచలనం కలిగిస్తుంటే..జార్ఖండ్ లో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంతో దేశంలో మహిళ భద్రతపై తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.