36ఏళ్ల తర్వాత: సీఏఏ కోసం తరుణ్ గోగొయ్ ఈజ్ బ్యాక్

మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ లీడర్, మూడు సార్లు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరుణ్ గోగొయ్ మరోసారి లాయర్ కోట్ ధరించారు. పౌరసత్వపు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో వాదించేందుకు లాయర్‌గా కోర్టు మెట్లు ఎక్కనున్నారు. వృత్తి రీత్యా లాయర్ అయిన గోగొయ్.. కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరానికి సహాయకుడిగా పనిచేశారు.  

ఈ మాజీ ముఖ్యమంత్రి 1983లో కోర్టులో చివరిసారిగా కేసు వాదించారు. అత్యున్నత న్యాయస్థానం జనవరి 22కు నోటీస్ జారీ అయింది. బీజేపీకు మిత్రపక్షమైన అస్సాం గానా పరిషత్(ఏజీపీ), రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా అభ్యర్థనలను వేసిన వారిలో ఉన్నారు. 

తరుణ్ గొగోయ్ కొడుకైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తరుణ్ గొగోయ్ లాయర్‌గా పౌరసత్వ చట్ట సవరణపై కోర్టులో నేడు వాదించేందుకు సిద్ధమవుతున్నారు’ అని తెలిపారు. దీనిపై ఆగష్టులో  స్పందించిన తరుణ్ గొగొయ్ ఇది వివక్ష చూపడమేనంటూ వ్యాఖ్యానించారు. 

పౌరసత్వ సవరణ చట్టం 2014 డిసెంబరు 31కు ముందునుంచి భారత్ లో ఉంటున్న హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులకు పౌరసత్వం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. పాకిస్తాన్, బంగ్లాదేవ్, అఫ్గనిస్తాన్ ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు మాత్రమే ఈ అవకాశం.