Left parties: ఇందన ధరల పెంపుపై దేశవ్యాప్త ఆందోళనకు లెఫ్ట్ పార్టీలు

జాతీయవ్యాప్తంగా నిరసన తెలియజేసేందుకు లెఫ్ట్ పార్టీలు రెడీ అయ్యాయి. జూన్ 16 బుధవారం నుంచి 30వరకూ పెరిగిన ఇందన, కమొడిటీల ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేయనున్నారు.

Left Parties

Left parties: జాతీయవ్యాప్తంగా నిరసన తెలియజేసేందుకు లెఫ్ట్ పార్టీలు రెడీ అయ్యాయి. జూన్ 16 బుధవారం నుంచి 30వరకూ పెరిగిన ఇందన, కమొడిటీల ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేయనున్నారు. లెఫ్ట్ పార్టీలు అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)- లిబరేషన్ దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ను ఆదివారం విడుదల చేసింది.

ఆ స్టేట్మెంట్ ప్రకారం.. జూన్ 16 నుంచి జూన్ 30వరకూ పార్టీల సంయుక్త నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టనున్నారు.