కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. లాక్ డౌన్ విధించడంతో రోడ్లపై వాహనాలు, జనాల రద్దీ లేదు. దేశమంతా నిర్మానుశ్యంగా మారింది. దీంతో అడవుల్లో ఉన్న జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోకి కూడా ప్రవేశిస్తున్నాయి.
గాంధీనగర్ కోలవాడలోని ఆయుర్వేద ఆస్పత్రిలోకి చిరుత పులి ప్రవేశించింది. ఆస్పత్రిలోని వాష్ రూమ్ లోకి చిరుత ప్రవేశించడంతో హాస్పిట్ సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు చిరుత పులిని బంధించి తీసుకెళ్లారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు.