బుడ్డోడు గట్టోడే : బర్రెల పరుగులో చిక్కుకుని భలే బైటపడ్డాడు 

  • Publish Date - March 6, 2019 / 10:30 AM IST

శివపురి: ఎందుకు పరిగెడతాయో తెలీదు గానీ గేదెలు ఒకోసారి ఉన్నట్టుండి హఠాత్తుగా పరుగందుకుంటాయి. అవి పరుగు పెట్టేసమయంలో వీటి మధ్యలో మనం పడ్డామంటే ప్రాణాలు హరీ మనక తప్పదు. కానీ ఈ పసివాడు మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురిలో జరిగింది.
 

శివపురిలోని ఒక కాలనీలో ఒక పిల్లవాడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి బాగా బలిష్టంగా ఉన్న రెండు గేదెలు  పరిగెత్తుకుంటూ పిల్లవాడి వైపు వచ్చాయి. అది చూసిన పిల్లవాడు తప్పించుకుందామనుకున్నాడు..కానీ అవి పరిగెత్తు కుంటు వచ్చేశాయి. దీంతో రెండు గేదెల మధ్యలో ఉండిపోయాడు ఆ పిల్లాడు. బాబుని రాసుకుంటు పరుగెత్తుకుంటు వెళ్లి అక్కడే పార్క్ చేసి ఉన్న వాహనాలను పడేసుకుంటే వెళ్లాయి. దీంతో భయపడిపోయిన ఆ బాలుడు బిత్తరపోయి నిల్చుండిపోయాడు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు ఆ బాలుడిని సురక్షితంగా వారి ఇంటిలోని వారికి అప్పగించారు. ఇదంతా ఆ వీధిలోని ఒక ఇంటి ముందున్న సీసీటీవీలో రికార్డయ్యింది.  ఈ వీడియోను గమనిస్తే ఆ బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకున్నాడో మీరు కూడా చూడండి..